calender_icon.png 12 January, 2025 | 9:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం

12-01-2025 06:33:26 PM

పదేళ్లలో బీఆర్ఎస్ నాయకులు చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం.... 

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod)ను తప్పుదోవ పట్టించి మహిళా సమైఖ్య భవనాలు, గ్రామపంచాయతీ కార్యాలయాలకు కేటాయించిన నిధులను దారి మళ్లిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ(BRS Party) నాయకులు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని బెల్లంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగతి సత్యనారాయణ ఆరోపించారు. బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ నాయకులను బద్నాం చేస్తున్నారని అన్నారు. ఆదివారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు చెప్పారు. 2023వ సంవత్సరంలో సమైఖ్య భవనాలకు, గ్రామపంచాయతీ కార్యాలయాలకు నిధులు మంజూరైన పనులు చేయకుండా బీఆర్ఎస్ నాయకులు కాలయాపన చేశారని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా రూ 6 కోట్ల 20 7 లక్షల నిధులు ల్యాప్స్ అయ్యే అవకాశం ఉండడంతో వాటిని గ్రామాలలో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా రహదారులు, డ్రైనేజీల నిర్మాణం కోసం వినియోగిస్తున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ హయాంలో గ్రామాలను అభివృద్ధి జరగడానికి జీర్ణించుకోలేక చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్పంచులు నిధులను పెద్ద ఎత్తున స్వాహా చేశారని, దీనిపై ఆర్టీఏ ద్వారా వివరాలు సేకరిస్తే వారి అవినీతి వెలుగు చూస్తుందని అన్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహకారంతో గ్రామాలలో అభివృద్ధి కోసం ప్రాణానికి రూపొందిస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధిని ఓర్వలేకనే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు తమపై తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారని చెప్పారు. నియోజకవర్గ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బత్తుల రవి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన బీఆర్ఎస్ నాయకుల హయాంలో మంజూరైన నిధులతో మహిళా సమైఖ్య భవనాలు, పంచాయతీ కార్యాలయాలు పూర్తి చేయలేదని ఆరోపించారు. మహిళలు ఏమాత్రం అధైర్యపడవద్దని, ఎమ్మెల్యే వినోద్ వాటికోసం ప్రతిపాదనలు పెట్టి నిధులు మంజూరు చేయిస్తారని చెప్పారు. మండలంలోని రవీంద్ర నగర్ రోడ్డు పూర్తి దశలో ఉందని, బుగ్గ దేవాలయం రోడ్డు పనులు కూడా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రూ 6 కోట్ల 27 లక్షల నిధులు వినియోగించకపోవడంతోనే వాటితో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై ఆరోపణలు చేసే స్థాయి బెల్లంపల్లి మండల బీఆర్ఎస్ నాయకులకు ఎంత మాత్రం లేదని అన్నారు. చౌకబారు ఆరోపణలతో అభివృద్ధి పనులను అడ్డుకునే ప్రయత్నం చేయవద్దన్నారు. కాంగ్రెస్ నాయకులు ముత్తె భూమన్న మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు సమైఖ్య భవనాలకు శంకుస్థాపనలు చేసి నిర్లక్ష్యంగా వదిలేశారని ఆరోపించారు. మహిళలు బీఆర్ఎస్ నాయకుల చుట్టూ తిరిగిన పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా నిలిచిపోయిన డిఎంఎఫ్టి నిధులను గ్రామీణ ప్రాంతాల రోడ్ల కోసం ప్రొసీడింగ్స్ తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పదేళ్ల కాలంలో బీ ఆర్ ఎస్ నాయకులు చేయలేని అభివృద్ధిని కాంగ్రెస్ హయాంలో సంవత్సర కాలంలో చేసి ప్రజల ఆదరణ చురగొంటున్నమని తెలిపారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎక్కడైనా తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కందుల ముకుందం, దామోదర్ గౌడ్, చిలుముల శ్రీనివాస్, మొండి, బొలిశెట్టి సుధాకర్, డాకూరి సురేష్, బాకం అంజయ్య లు పాల్గొన్నారు.