22-02-2025 12:03:13 AM
అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి
బూర్గంపాడు/అశ్వాపురం, ఫిబ్రవరి 21 : ఆటోల్లో ప్రయాణించే వారికి పూర్తి భరోసా, భద్రత కల్పించడమే పోలీసుల బాధ్యత అని అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి అన్నారు.జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలు, మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి సూచనల మేరకు అశ్వాపురం మండలంలోని ఆటోల యజమానుల నుంచి అవసరమైన డాక్యుమెంట్ల సమాచారం సేకరించి డిజిటలైజేషన్ చేసిన సమాచార యాప్ స్టిక్కర్లను ఆటో వెనకాల అంటించడం జరిగిందని సిఐ జి.అశోక్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రజలకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు పోలీసు యంత్రాంగం పని చేస్తున్నదని, ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించొద్దని డ్రైవర్లకు సూచించారు. రాత్రి సమయాల్లో ఆటో డ్రైవర్లు అధిక మొత్తం వసూలు చేసిన మార్గమధ్యంలో వదిలేసిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అశ్వాపురం ఎస్‌ఐ షేక్ సైదా రహుఫ్, సిబ్బంది, ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.