calender_icon.png 5 November, 2024 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్స్యకార కుటుంబాల్లో సిరులు కురవడమే ప్రభుత్వ లక్ష్యం..

05-11-2024 03:43:22 PM

యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నేడు యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, పెద్ద తుమ్మలగూడెం (ఇంద్రపాల నగరం) చెరువులో ఉచిత చాప పిల్లలని వదిలిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, భువనగిరి శాసనసభ్యులు కుంభమ్ అనిల్ కుమార్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, డిసిపి రాజేష్ చంద్ర పాల్గొన్నారు. చెరువులే జీవనాధారంగా బతుకుతున్నటువంటి మత్స్యకారుల కుటుంబాల్లో సిరులు పండాలని, మత్స్యకారులకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా మత్స్యశాఖ అధికారులు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల నాయకులు, జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.