హైదరాబాద్: గత పదేళ్లు మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR) అధికారంలో ఉండి ఏకకాలంలో రూ.లక్ష రుణమాఫీని చేయలేకపోయడాని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు(Minister Tummala Nageswar Rao) ఆరోపించారు. రుణమాఫీకి ఐదేళ్లు పట్టడంతో రైతులపై రూ.11,145 కోట్ల రుణాభారం పడిందన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వత వ్యవసాయ రంగానికి రూ.72 కోట్లు కేటాయించామని మంత్రి తెలిపారు. సాగు చేసే రైతులకు భరోసా ఇవ్వలనేదే ప్రభుత్వ లక్ష్యమని, రైతుభరోసాపై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని మంత్రి తుమ్మల మండిపడ్డారు. నిన్న నల్గొండ బీఆర్ఎస్ రైతు మహధర్నా ర్యాలీలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR), బీఆర్ఎస్ నేతలు అసత్యాలు చెప్పారని మంత్రి విరుచుకుపడ్డారు. గతంలో రైతుబంధు అమలైన విధానాన్ని బీఆర్ఎస్ నేతలు మర్చిపోయారని, బీఆర్ఎస్ సర్కార్ రైతుబంధును కోతల సమయానికీ ఇవ్వలేదని మంత్రి తుమ్మల విమర్శించారు.