ఇల్లందులో రూ. 40 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం...
ఇల్లెందు (విజయక్రాంతి): రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) ఇల్లందులో పలు అభివృద్ధి పనులను బుధవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇల్లందు మండలం పరిధిలోని కరెంట్ ఆఫీస్ ఏరియా నుంచి రాఘబోయినగూడెం పంచాయతీ రోడ్డు వరకు ఖమ్మం ప్రధాన రహదారిపై రూ. 10 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్ శంఖుస్థాపన, రూ కోటి రూపాయలతో జీకే కాలనీలో నిర్మించిన డిజిటల్ సెంట్రల్ లైబ్రరీ(Digital Central Library) ప్రారంభం, రూ 4 కోట్లతో చేపట్టే పట్టణంలోని బుగ్గ వాగు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 30 కోట్ల రూపాయలతో గోవింద్ సెంటర్ నుండి 24 ఏరియా నెహ్రు నగర్ వరకు, గోవింద్ సెంటర్ నుండి సత్యనారాయణపురం వరకు నిర్మించిన బీటీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ అభివృద్ధి పనులను ప్రారంభించారు.
అనంతరం చెరువుకట్ట సమీపంలోని కోటి రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న సిమ్మింగ్ పూల్, రూ. 70 లక్షలతో సుందరీకరించిన చిల్డ్రన్ పార్క్(Childrens Park) ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ముందుకు సాగుతుందన్నారు. ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం ప్రజా సంక్షేమం ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సాగిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ శాఖ చైర్మన్ మువ్వ విజయబాబు, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, వైఎస్ చైర్మన్ సయ్యద్ జానీ పాషా, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ , ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పీవో రాహుల్, డీఎఫ్ఓ, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.