12-03-2025 12:00:00 AM
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
చిట్యాల,మార్చి 11(విజయ క్రాంతి): అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ పాలన సాగిస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం జయశంకర్ భూ పాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని గోపాలపురం, ముచినిపర్తి, చల్లగరిగా, జూక ల్, తిరుమలాపూర్, చిట్యాల మోడల్ స్కూ ల్ ఆవరణం, నవాబుపేట, చింతకుంటరామయ్యపల్లి, బావుసింగ్ పల్లి, గాంధీనగర్, నైన్ పాక, చైన్ పాక, వెంకట్రావ్ పల్లి(సీ), బావుసింగ్ పల్లి , వెంచరామి, శాంతినగర్ గ్రామాల్లో సిసి రోడ్లు,పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పార్టీ శ్రేణులతో కలిసి శం కుస్థాపన చేశారు.
అలాగే మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధి దారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ. కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల అభివృద్ధి కోసం నిత్యం కృషి చేస్తుందని తెలిపారు. రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా అం దించి రైతులను అన్ని విధాలుగా ఆదుకుందని తెలిపారు.
రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనుల కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ హేమ,ఎంపీడీవో జయశ్రీ, టిపిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, మా ర్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి సత్యనారాయ ణ,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి మూఖిరా ల మధు వంశీకృష్ణ, టేకుమట్ల మాజీ జెడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి, మాజీ సర్పంచుల ఫో రం అధ్యక్షుడు కామిడీ రత్నాకర్ రెడ్డి, దొడ్డి కిష్టయ్య, బుర్ర శ్రీనివాస్ , బుర్ర లక్ష్మణ్ గౌడ్,మూల శంకర్ గౌడ్,అల్లకొండ కుమార్, గంగాధరి రవీందర్, కాంగ్రెస్ కార్యకర్తలు ,పార్టీ శ్రేణులు అధికారులు పాల్గొన్నారు.