calender_icon.png 8 April, 2025 | 2:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడుగుల అభ్యున్నతే కాంగ్రెస్ ధ్యేయం

08-04-2025 12:00:00 AM

కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్

చేగుంట, ఏప్రిల్ 7 :బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని చేగుంట కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కొరకు రేషన్ దుకాణాలలో సన్న బియ్యం పంపిణీ శ్రీకారం చుట్టిందని అన్నారు. సోమవారం నాడు మండల కేంద్రమైన పొలంపల్లిలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ కొండి మల్లేష్, కొండి శ్రీనివాస్, గ్రామ అధ్యక్షులు కర్ర స్వామి, ఉపాధ్యక్షులు కొండి మల్లేష్, చంద్రశేఖర్ గౌడ్, సురేష్, నరేష్, చౌడం నర్సిములు,స్వామి, రాజు, యాదగిరి, చిన్న స్వామి, అంజి, రమేష్, సత్యనారాయణ, దుర్గయ్య, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.