calender_icon.png 31 October, 2024 | 12:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం

14-08-2024 03:22:16 AM

యాదాద్రి భువనగిరి, ఆగస్టు 13 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల బలోపేత మే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. మంగళవారం భువనగిరిలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయలు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పదోన్నతి పొందిన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందన్నారు.

ఉపాధ్యాయులు బాధ్యతతో విధులు నిర్వర్తించి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ సందర్భంగా 60 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్ర మంలో పీసీసీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, టీజాక్ ప్రధాన కార్యదర్శి పార్వతి సత్యనారాయణ, తోట సత్యనారాయణ, చాగంటి ప్రభాకర్ పాల్గొన్నారు.