ప్రైవేటు , ప్రభుత్వ నిరుద్యోగులకు బాసటగా నిలుస్తా...
హుజురాబాద్ లో వాకర్స్ తో ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి..
హుజురాబాద్, (విజయక్రాంతి): పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం హుజురాబాద్ పట్టణ కేంద్రంలో వాకర్స్ తో సమావేశమై రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మద్దతు తెలుపాలని కోరారు. నిరుద్యోగులకు బాసటగా నిలిచి వారి సమస్యల పరిష్కారానికి ప్రశ్నించే గొంతుకనై పోరాడుతానని వెల్లడించారు. 34 యేండ్లలో ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు ఫీజుల్లో రాయితీ కల్పించామని, చాలా మందికి ఉచిత విద్యతో పాటు వసతి కల్పించామని వారంతా ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగలతో పాటు విదేశాల్లో స్థిరపడ్డారని గుర్తు చేశారు. కొంతమంది తనపై చేస్తున్న దుష్ప్రచారం కేవలం రాజకీయ విమర్శలే అని కొట్టి పారేశారు. విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించి నవ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఉద్దేశంతోనే తాను శాసనమండలి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని తనను ఆశీర్వదించి గెలిపిస్తే విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ యువతకు ఉపాధి మార్గాలు చూపడమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. విలువలతో కూడిన విద్యను అందించాలనే తపనతో పెద్దల సభలోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నానని, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల సమస్యలు తీర్చడంతో పాటు వృత్తి నైపుణ్య కోర్సులను ప్రవేశపెట్టడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. పట్టభద్రులంతా తనను గెలిపిస్తే చట్టాల రూపకల్పనతో పాటు, నిరుద్యోగ సమస్య నిర్మూలన ఎజెండాగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.