calender_icon.png 20 September, 2024 | 9:56 AM

విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యం

20-09-2024 01:07:16 AM

హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులకు సూచించారు. గురువారం హైదరాబాద్ విద్యాశాఖ కార్యాలయంలో డీఈవో ఆర్ రోహిణి ఆధ్వర్యంలో సీఆర్పీలు, సూపరింటెండెంట్లు, సెక్టోరియల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా సీఆర్పీలు జాబ్ చార్ట్ ప్రకారం పని చేయాలని సూచించారు.

విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచే బాధ్యత సీఆర్పీలదేనని స్పష్టం చేశారు. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టంలో 67.65 శాతంతో రాష్ట్రం లోనే హైదరాబాద్ జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు. ప్రథమ స్థానంలో నిలిపేందుకు సీఆర్పీలు సైనికుల్లా కృషి చేయాల న్నారు. నెల రోజులకు పైగా పాఠశాలకు గైర్హాజరైన విద్యార్థుల పేర్లను ఎఫ్‌ఆర్‌ఎస్ నుంచి తొలగించాలన్నారు. హాజరు శాతం తక్కువ ఉన్న పాఠశాలల సీఆర్పీలకు షోకాజ్ నోటీసులివ్వాలని ఆదేశించారు.