- టీజీఎస్పీడీసీఎల్ ఇన్‌చార్జి డైరెక్టర్ నందకుమార్
- ‘గ్రేటర్’లో విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 3 (విజయక్రాంతి): వినియోగదారుల అవసరాలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని టీజీ ఎస్పీపీడీసీఎల్ డైరెక్టర్ నంద కుమార్ అన్నారు. నగరంలోని మింట్ కాంపౌండ్‌లోని మెట్రోజోన్ కార్యాలయంలో ఆదివారం నిర్వహిం చిన విద్యుత్ వినియోగదారుల దినోత్సవంలో ఆయన మాట్లాడారు.
విద్యుత్ శాఖలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామన్నారు. హిమాయత్ నగర్‌కు చెందిన అపార్ట్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షురాలు రజిని మాట్లాడుతూ.. విద్యుత్‌శాఖ టైటిల్ ట్రాన్స్‌ఫర్ విధానాన్ని సరళతరం చేయడం అభినందనీయమన్నారు.
గాంధీనగర్ ఇండస్ట్రీయల్ ఎస్టేట్ అధ్యక్షుడు స్వామి గౌడ్ మాట్లాడుతూ.. హెచ్‌టీ వినియోగదారుల కోసం వాట్సాప్ గ్రూప్ ద్వారా సమస్యలను పరిష్కరించే విధానానికి శ్రీకారం చుట్టిన శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. సెంట్రల్ సర్కిల్‌కు చెందిన వినియోగదారుడు శరత్ మాట్లాడుతూ.. విద్యుత్ సమస్యలపై ఎస్‌ఈ స్థాయి అధికారికి ఫోన్ చేసినా స్పందించడం అభినంద నీయమన్నారు.
అనంతరం మెట్రోజోన్ సీఈ చక్రపాణి విద్యుత్ వినియోగదారుల హక్కులను వివరించారు. కార్యక్రమంలో ఇంచార్జి డైరెక్టర్ డాక్టర్ నర్సింహులు, సీఈలు సాయిబాబా, సీజీఆర్‌ఎఫ్ సభ్యులు వెంకట్, ఎస్‌ఈలు పాల్గొన్నారు.
సమస్యలు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయండి
విద్యుత్ వినియోగదారులు తాము విద్యుత్ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఎక్స్ (ట్విట్టర్) లేదా విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912 లేదా టీజీ ఎస్పీడీసీఎల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని రంగారెడ్డి జోనల్ సీఈ పాండ్య సూచించారు. రంగారెడ్డి జోన్ కార్యాలయం గచ్చిబౌలిలో ఆదివారం నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల దినోత్సవంలో ఆయన మాట్లాడారు.
వినియోగదారుల సమస్యలను పరిష్కరించడంలో తమ శాఖ నిర్లక్ష్యంగా ఉండబోదని స్పష్టం చేశారు. అనంతరం కేపీహెచ్‌బీ, కొండాపూర్, గచ్చిబౌలి డివిజన్లకు చెందిన గేటెడ్ కమ్యూనిటీ వినియోగదారులు మాట్లాడుతూ.. నగరంలో అపాయకరంగా ఉన్న ట్రాన్స్ ఫార్మ ర్లు, ట్రాఫిక్‌కు అడ్డువస్తున్న విద్యుత్ స్తంభాలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
కార్య క్రమంలో రంగారెడ్డి ఎస్‌ఈ చంద్రశేఖర్, డీఈలు యాదగిరి, శ్యాం కుమార్, ఆపరేషన్, అకౌంట్స్ విభాగం అధికారులు, విని యోగదారులు నరసింహారావు, పట్టాభి, డాక్టర్ రవికిశోర్, శంకర్ (వన్ సిటీ), సాయి చౌదరి (మలేషియా టౌన్‌షిప్), నాగభూషణం (లోధా మెరిడీయన్) పాల్గొన్నారు.