calender_icon.png 9 March, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం

11-12-2024 02:20:33 AM

* నిశ్చల్ స్మార్ట్ లెర్నింగ్ సొల్యూషన్స్ వ్యవస్థాపకులు నిశ్చల్ నారాయణం

* ఏఆర్ యాప్, వీఆర్ 3డీఈ- బుక్స్ ఆవిష్కరణ

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 10 (విజయక్రాంతి): విద్యను విప్లవాత్మకంగా మార్చడమే లక్ష్యంగా విద్యారంగంలో అనేక ఆధునిక మార్పులు తీసుకురావాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని నిశ్చల్ స్మార్ట్ లెర్నింగ్ సొల్యూషన్స్ వ్యవస్థాపకులు నిశ్చల్ నారాయణం అన్నారు. బేగంపేటలోని నిశ్చల్ స్మార్ట్ లెర్నింగ్ సొల్యూషన్స్ కార్యాలయంలో 6 నుంచి 12వ తరగతి విద్యార్థుల కోసం నిశ్చల్ లెన్స్ ఏఐ ఆధారిత ఏఆర్ (ఆగ్మెంటెడ్ రియాలిటీ) యాప్, 1 నుంచి 5వ తరగతి విద్యార్థుల కోసం వీఆర్ ఆధారిత 3డీ ఈ-బుక్స్‌ను మంగళవారం ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో మొదటి వీఆర్ ఆధారిత 3డీ ఈ-బుక్స్, ఏఐ ఆధారిత ఏఆర్ యాప్ నిశ్చల్ లెన్స్ ద్వారా సంప్రదాయ పద్ధతులు, భవిష్యత్తు అభ్యాసం మధ్య తేడాను పూడ్చడమే లక్ష్యంగా పనిచేస్తాయన్నారు. దేశవ్యాప్తంగా విద్య రంగాన్ని మెరుగుపర్చడానికి వినూత్న ప్రాజెక్టులు చేపడుతున్నట్టు తెలిపారు. ఏఐ, ఏఆర్ ఆధారితంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వంటి సబ్జెక్ట్‌ల కోసం ప్రత్యేక యాప్ రూపొందించినట్టు తెలియజేశారు. ఈ యాప్ ద్వారా 35 వేల వీడియోలు, 28 వేల 3డీ యానిమేషన్లు, సిమ్యులేషన్లతో ఉంటుందన్నారు. సిక్కిం ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రత్యేక గణితం, శాస్త్ర ప్రయోగశాలలను నెలకొల్పామన్నారు. వివరాల కోసం 99591 54371, 99639 80259 నంబర్లలో సంప్రదించాలన్నారు.