హైదరాబాద్: ఎల్బీ స్టేడియం వేదికగా జరుగుతున్న 18వ రాజీవ్‌గాంధీ ఆలిండి యా అండర్-19 టీ20 టోర్నీలో బీహార్‌పై చెన్నై జట్టు విజయాన్ని సాధించింది. మ్యాచ్ కు ముఖ్య అతిథిగా హాజరైన క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వి.హనుమంత రావు కరణ్ కన్నన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందించారు.
వి హనుమంతరావు మాట్లాడుతూ.. దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు గత 18 సంవత్సరాలుగా రాజీవ్ గాంధీ పేరుతో అండర్--19 టీ-20 క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు.
కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీకాంత్ గౌడ్, మాజీ కార్పొరేటర్ మమత, కాంగ్రెస్ నేతలు అప్సర్ యూసుఫ్ జాయి, అమర్ జీత్, సయ్యద్ పాషా తదితరులు పాల్గొన్నారు.