calender_icon.png 26 October, 2024 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఔత్సాహిక మహిళలను ప్రోత్సహించడమే లక్ష్యం

26-10-2024 12:38:39 AM

  1. వ్యాపార అవకాశాలను పెంచడంలో పూర్తి సహకారం
  2. వీ-హబ్ సీఈవో సీతా పల్లచోళ్ల

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): తెలంగాణలోని మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ హబ్ (వీ-హబ్) సీఈవో సీతా పల్లచోళ్ల తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియో గించడం, సామాజిక ప్రభావాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

శుక్రవారం వీ-హబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీతా పల్లచోళ్ల మాట్లాడారు. వీ-హబ్ ద్వా రా మహిళలకు వ్యాపార అభివృద్ధి, పెట్టుబడులు, నెట్‌వర్కింగ్, శిక్షణ, మెంటరింగ్ వంటి సేవలు అందిస్తున్నామని తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతోపాటు వారికి వ్యాపార అవకాశాలను పెంచే దిశగా కార్యక్రమాలను చేపడుతున్నామని స్పష్టం చేశారు.

వీ-హబ్ ద్వారా మహిళలకు ప్రత్యేకంగా మద్దతునందించేందుకు ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని తెలిపారు. మహిళల సాంకేతిక, ఆర్థిక స్వావలంబనను బలోపేతం చేయడంలో వీ-హబ్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సోషల్ ఇంపాక్ట్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించామని తెలిపారు.

మార్కెటింగ్, నిధుల సమీకరణలో సలహాలు, నిపుణుల మార్గదర్శనం వంటి అవకాశాలు వీ-హబ్ ద్వారా మహిళలకు అందుబాటులో ఉన్నామని పేర్కొ న్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వీ- హబ్ ప్రారంభించిన అనేక కార్యక్రమాలు, వ్యాపారాలకు ఆధునికత, సాంకేతికతను జో డించడం ద్వారా ఎంతో మంది మహిళల జీ వితాలకు మేలు జరుగుతుందని తెలిపారు.