23-02-2025 07:43:33 PM
ఆక్స్ ఫర్డ్ గ్రామర్ హైస్కూల్ చీఫ్ ప్యాట్రన్ మణికొండ వేదకుమార్..
ముషీరాబాద్ (విజయక్రాంతి): లాభాపేక్ష లేకుండా నిరుపేద బాలికలకు విద్యను అందించడమే టచ్ ఎ లైఫ్ ఫౌండేషన్ లక్ష్యం అని ఆక్స్ ఫర్డ్ గ్రామర్ హైస్కూల్ చీఫ్ ప్యాట్రన్ మణికొండ వేదకుమార్ అన్నారు. ఈ మేరకు ఆదివారం హిమాయత్ నగర్ ఆక్స్ ఫర్డ్ గ్రామర్ స్కూల్ లో నిర్వహించిన ఎడ్యుకేషన్ క్యాంప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేదకుమార్ పాల్గొని మాట్లాడుతూ... బాలికలు ఎప్పుడూ ఆత్మ న్యూనత చెందకూడదని వారి సామర్థ్యాన్ని గుర్తించి ముందుకు సాగాలని సూచించారు.
గౌరవ అతిథి బ్రిగేడియర్ ఇందర్ సేథీ మాట్లాడుతూ టచ్ ఎ లైఫ్ ఫౌండేషన్ అందించే అవకాశాలను సద్వినియోగం చేసుకుని అమ్మాయిలు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరారు. విద్యలో ఆర్థిక సహాయం అవసరమైన నిరుపేద బాలికలు సంఘటితం చేయడంలో కీలక పాత్ర పోషించిన మణికొండ సురేష్ కుమార్ సేవలు ప్రశంసనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో సందెబోయిన అభిషేక్ యాదవ్, సర్ఫరాజ్, నందు, చంద్రేష్, సాయిచైతన్య తదితరులు పాల్గొన్నారు.