కామారెడ్డి జిల్లా సదాశివనగర్ నగర్‌లో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న పౌరసరఫరాల డీఎస్ చౌహాన్
పౌరసరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్ చౌహాన్
కామారెడ్డి, నవంబర్ ౮ (విజయక్రాంతి): రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు బియ్యం పంపిణీ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పౌరసరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్ చౌహాన్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి, నిజామాబాద్ కలెక్టరేట్‌లలో రైస్‌మిల్లర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పండించే ధాన్యం ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు.
రాష్ట్రంలో పండించిన బియ్యం తిరిగి నిత్యావసర సరుకుల పంపిణీ ద్వారా నిరుపేద ప్రజలకు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. మిల్లర్లకు వారి గత సీఎంఆర్ పనితీరును బట్టి పారదర్శకంగా ధాన్యం కేటాయించనున్నట్టు వెల్లడించారు. మిల్లర్ల సహకారంతో ధాన్యం సేకరణ, మిల్లింగ్ జరుగుతుందని తెలిపారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి, శుభ్రపరచి కొనుగోలు కేంద్రాలను తీసుకురావాలని సూచించారు. అలా చేసే మద్దతు ధర దక్కుతుందన్నారు.
ధాన్యం కాంట అయిన మూడు, నాలుగు రోజుల్లోనే చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. నాణ్యమైన ధాన్యం ప్రతి బస్తాలో 40.650 కిలోలుగా తూకం వేస్తారని, రైతులు ఈ విషయాన్ని సూచించారు. సమావేశంలో నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంత్, కామారెడ్డి కలెక్టర్ ఆశిష్‌సంగ్వాన్, ఎస్పీ సింధూశర్మ, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్న్రెడ్డి, వీవీ విక్టర్, ఆర్డీవో రంగనాథ్‌రావు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, ఇన్‌చార్జి జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింహరావు, జిల్లా సహకార అధికారి రాంమోహన్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారిని రమ్య పాల్గొన్నారు.