భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 25 (విజయక్రాంతి): క్రీడాకారుల్లోని ప్రతిభ పాటవాలు, నైపుణ్యాలు వెలికి తీసి వారికి నచ్చిన క్రీడల్లో తగిన ప్రొత్సహించి జాతీయ స్థాయిలో పథకాలు సాధించేలా తీర్చిదిద్దడమే ధ్యేయమని ఐటీడీఏ పీవో రాహుల్ అన్నా. పాల్వంచలోని మినీ స్టేడియంలో శనివారం జిల్లా యువజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అథ్లెటిక్స్, ఆర్చరీ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈనెల 29న ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని అథ్లెటిక్స్‌లో 50 మంది, ఆర్చీరీలో 40 మందికి పోటీలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్చరీ కోచ్ కల్యాణ్, అథ్లెటిక్స్ కోచ్ నాగేందర్, హాకీ కోచ్ ఇమాం, యుగంధర్‌రెడ్డి పాల్గొన్నారు.