calender_icon.png 28 October, 2024 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్స్యకారుల అభ్యున్నతే ధ్యేయం

28-10-2024 01:42:46 AM

సిరిసిల్ల, అక్టోబర్ 27 (విజయక్రాంతి): మత్స్యకారుల ఆర్థిక అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఆయన వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం జలాశయంలో 80 వేల చేపపిల్లలు వదిలి మాట్లాడారు. ప్రభుత్వం మత్స్యకారులకు 100 శాతం సబ్సిడీతో చేప పిల్లలను పంపిణీ చేస్తున్నదన్నారు. 

ఈ నెల 4న మంత్రి పొన్నం ప్రభాకర్ ఎల్ ఎండీలో చేప పిల్లల్ని విడుదల చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.53 కోట్ల చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో 8,642 మత్స్యకార కుటుంబాలకు చేతి నిండా పని అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఫిషరీస్ చైర్మన్ మొట్టు సాయికుమార్, అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్,  మ త్య్సశాఖ అధికారి వరదారెడి పాల్గొన్నారు.