25-02-2025 02:38:25 AM
సిరిసిల్లలో టెక్స్‌పోర్ట్ ఇండస్ట్రీస్ యూనిట్‌పై కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): సిరిసిల్లలో అపేపర్ పార్కులో టెక్స్‌పోర్ట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెట్ తన రెడీమేడ్ గార్మెంట్ యూనిట్‌ను త్వరలో ప్రారంభించనున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు.
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే 2022లోనే ఈ ఒప్పందం కుదిరిందని, ఇప్పుడు కార్యరూపం దాల్చిందన్నారు. దీని ద్వారా రెండువేల మంది మహిళలకు ఉపాధి దక్కుతుందన్నారు. ఇప్పటికే ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తి కాగా.. త్వరలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.