calender_icon.png 27 January, 2025 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏజెన్సీ ఫోకస్ నిధులమీదే ఉంది

26-01-2025 01:11:45 AM

కాళేశ్వరం విచారణ సందర్భంగా ఆఫ్కాన్స్ ప్రతినిధులపై కమిషన్ ఆగ్రహం

హైదరాబాద్, జనవరి 25 (విజయక్రాంతి) : ఏదైనా ప్రాజెక్టు పనులు చేప ట్టేముందు సంబంధిత కాంట్రాక్టర్ అన్ని అంశాలను చూసుకోవాల్సిన బాధ్యత లేదా అంటూ కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చేపట్టిన ఆఫ్కాన్స్ సంస్థను కాళేశ్వరం విచారణ కమిషన్ ప్రశ్నించింది.

శనివారం జరిగిన కాళేశ్వరం విచారణకు అన్నారం బ్యారేజి నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్ ప్రతినిధులు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ ప్రతినిధులు నాగమల్లికార్జున్ రావు, శేఖర్‌దాస్‌పై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్మాణానికి ముందు కనీస నిబంధనలు పాటించలేదని కమిషన్ పేర్కొం ది.

నిర్మాణ సంస్థలు, నిర్మాణంలో నిబంధనలు పాటించి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదని పేర్కొంది. ఏజెన్సీల ఫోకస్ నిధుల మీదనే ఉంద ని, అందుకే  కమిషన్ ముందు కూడా నిధుల ప్రస్తావనే తెస్తున్నాయని ఆగ్ర హం వ్యక్తంచేసింది. టెండర్లు వేసే ముందు కనీస జాగ్రత్తలు తీసుకోవాలి కదా.. ఎందుకు విఫలమయ్యారంటూ కమిషన్ ప్రశ్నించింది.

ఈపీసీ కాంట్రా క్టు అయితే సర్వేలు చేస్తారని.. ఐటమ్ రేట్ కాంట్రాక్టు కాబట్టి నేరుగా ఎలాం టి సర్వేలు చేయలేదని సంస్థ సమాధానమిచ్చింది. ప్రాజెక్టు నాణ్యత ఎన్ని రోజులు ఉంటుందని కమిషన్ ప్రశ్నించగా.. వందేళ్ల వరకు ఉండేలా నిర్మిం చినట్లు సంస్థ  ప్రతినిధులు తెలిపారు. నిబంధనలు పాటించి ఉంటే వందేళ్ల ప్రాజెక్టు ఏడాదికే డ్యామేజ్ అయ్యేది కాదని కమిషన్ మండిపడింది.

అన్నా రం బ్యారేజి నిర్మాణం ఆలస్యం కావడానికి కారణంపై అడిగిన ప్రశ్నకు.. లొకేషన్ మార్పు కారణంగా బ్యారేజి నిర్మాణం ఆలస్యం అయ్యిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 2017, 2018 వరదల్లో ఎలాంటి ఇబ్బంది జరగలేదని.. 2019 నవంబర్ వరదల్లో సమస్యలు గుర్తించామని సంస్థ ప్రతినిధు లు కమిషన్‌కు తెలిపారు. అన్నారం బ్యారేజీకి ఎలాంటి క్రాక్స్ రాలేదని.. ఓసారి సీపేజీ సమస్య వస్తే వెంటనే గ్రౌటింగ్ ద్వారా సరిచేసినట్లు వారు చెప్పారు.