బాధిత కుటుంబాన్ని పరామర్శ...
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
వనపర్తి (విజయక్రాంతి): ఉన్నత చదువులు చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదిగి కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడన్నా కొడుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం భాధిత కుటుంబానికి తీరని లోటు అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిలు అన్నారు. వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో బుధవారం ప్రవీణ్ అనే విద్యార్థి ఫ్యాన్ కు ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిలు బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికీ చేరుకుని మార్చురీ వద్ద గల బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికీ తీసుకుని వెళ్లి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని వారు బాధిత కుటుంబానికి భరోసాను ఇచ్చారు.