13-12-2024 12:32:11 AM
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం పద్మనాభరెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): రాష్ట్ర ఆర్థిక సంఘం సలహాలను ప్రభుత్వం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం పద్మనాభరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎస్‌కు తగిన సూచినల చేయాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పద్మనాభరెడ్డి గురువారం లేఖ రాశారు.
రాష్ట్ర ఆర్థిక సంఘం సూచనలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తుచేశారు. రాష్ట్ర ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు ఏ మేరకు ఆర్థికసాయం చేయాలని చెప్పిందో ఎవరికీ తెలియదని పేర్కొన్నారు. గత సర్కారు ఆర్థిక సంఘం సూ చనలను పరిగణలోకి తీసుకున్న దాఖలాలు లేవని తెలిపారు. మార్చి 2024 నుంచి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ నిధులు రావడంలేదని లేఖలో పేర్కొన్నారు.
దానికి తోడు గత రెండేండ్లుగా రాష్ర్ట ప్రభుత్వం స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేయడం లేదని గుర్తుచేశారు. ఫలితంగా స్థానిక సంస్థల్లో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయినాయని వివరించారు. రాష్ర్ట ఆర్థిక సంఘం ఇచ్చిన నివేదికలపై ప్రభుత్వం చర్యలు తీసుకొని, వాటిని రాష్ర్ట అసెంబ్లీ ముం దు ఉంచేలా సీఎస్‌కు ఆదేశాలు ఇవ్వాలని పద్మనాభరెడ్డి కోరారు.