calender_icon.png 1 March, 2025 | 9:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండుటెండలో పాఠశాల మైదానంలో విద్యార్థులు

01-03-2025 06:25:44 PM

స్కూల్ ఫీజు చెల్లించలేదని వేద ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వాహకం..

కొండపాక (విజయక్రాంతి): స్కూల్ ఫీజు చెల్లించని విద్యార్థులను పాఠశాల మైదానంలో ఎర్రటీ ఎండలో  సుమారు 15 రోజులుగా నిలబెడుతున్నారు. ప్రతిరోజు పాఠశాలకు వస్తున్న పిల్లలను ఫీజు చెల్లిస్తేనే తరగతికి అనుమతిస్తున్నారు లేదంటే ఎండలో నిలబడాల్సిందే. పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పీజీ చెల్లించేందుకు గడువు కోరిన అవకాశం ఇవ్వకుండా విద్యార్థుల పట్ల కర్కషంగ ప్రవర్తిస్తున్న వేద ఇంటర్నేషనల్ స్కూల్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు కోరుతున్నారు. విషయాన్ని విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం గమనార్వం.