19-04-2025 01:53:07 PM
మహబూబాబాద్, (విజయక్రాంతి): హైదరాబాదులో ఈనెల 21న తలపెట్టిన ఉద్యమకారుల ప్లీనరీని విజయవంతం చేయాలని మహబూబాబాద్ (Mahabubabad District) కేసముద్రంలో ప్రచార పోస్టర్ ను ఉద్యమకారులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమకారులు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యమకారులకు ఎలాంటి చేయూతను అందించలేదని, ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు పలు హామీలను ఇచ్చిందని, ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా ప్లీనరీలో నిర్ణయం జరుగుతుందని చెప్పారు.
ఈ ప్లీనరీకి తెలంగాణ ఉద్యమకారులంతా హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారులకు ఇంటి స్థలం, ఉద్యమంలో మరణించిన కుటుంబాల సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం, 10 లక్షల పరిహారం, ఇందిరమ్మ ఇండ్లు, నెలకు 25 వేల రూపాయలు పింఛన్, గుర్తింపు కార్డులు సాధించడమే లక్ష్యంగా ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు గుగులోత్ నాయక్, చాగంటి కిషన్, షేక్ ఖాదర్, దామర కొండ ప్రవీణ్ కుమార్, బట్టు శ్రీనివాస్, దండు శ్రీనివాస్, కొలిపాక వెంకన్న, చిట్యాల వీరన్న, బాలు మోహన్, వేమ్ నర్సింహారెడ్డి, సోమరపు వెంకటయ్య, జనిగల పరమేశ్వర్, మాందాటి ఆంజనేయులు, ఎస్ కే యాకూబలి, నాగనబోయిన చంద్రకళ, గుగులోతు సునీత పాల్గొన్నారు.