calender_icon.png 30 October, 2024 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాక్షన్ ముగిసింది.. పాట బాకీ ఉంది

30-10-2024 12:00:00 AM

‘దేవర’ ప్రేక్షకుల ముందుకు రాగానే చిన్న విరామం తీసుకుని వెంటనే ‘వార్ 2’ షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్లారు. ఆ వెంటనే వార్ 2 టీం ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌తో కలిసి భారీ యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ మొదలు పెట్టేశారు.. షూటింగ్‌కి సంబంధించిన ఒక ఫోటో కూడా లీక్ అయిన విషయం తెలిసిందే. ఇక యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ అయితే తాజాగా ముగిసినట్టు తెలుస్తోంది.

ఇప్పుడొక పాటకు సంబంధించి షూటింగ్ మిగిలి ఉందట. దర్శకుడు ఆయాన్ ముఖర్జీ ఈ పాట చిత్రీకరణ కోసం సిద్ధమవుతున్నారని సమాచారం. ఎన్టీఆర్ స్టెప్స్ కోసమే సినిమా చూసేవాళ్లు చాలా మంది ఉన్నారు. మరోవైపు బాలీవుడ్‌లో డ్యాన్స్‌లో హృతిక్‌ను కొట్టేవారు లేరనడంలో అతిశయోక్తి కాదు.

మరి వీరిద్దరూ సింగిల్ ఫ్రేమ్‌లో డ్యాన్స్ చేస్తుంటే.. చూసేందుకు రెండు కళ్లూ చాలవేమో! ఇప్పటికే ఎన్‌టీఆర్, హృతిక్ పాట కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టారని సమాచారం. ఈ పాటను మూడు రోజుల్లో చిత్రీకరించేలా అయాన్ ముఖర్జీ ప్లాన్ చేస్తున్నారట.

ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయనున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.