12-04-2025 05:01:29 PM
సూర్యాపేట (విజయక్రాంతి): నల్గొండ జిల్లా కేంద్రంలో ఫోటోగ్రాఫర్ గా జీవనోపాధి గడుపుతున్న గద్దపాటి సురేష్ ని అతికిరాతకంగా నరికి హత్య చేసిన గుర్తు తెలియని దుండగులను గుర్తించి ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ఉమ్మడి నల్గొండ జిల్లా ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఫోటోగ్రాఫర్ సురేష్ హత్యకు నిరసనగా సూర్యాపేట పట్టణ ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొక్కుల శేఖర్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నల్గొండ పట్టణంలో గీతాంజలి కాంప్లెక్స్ లో మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ నిర్వహిస్తున్న సురేష్ ఎంతోమందికి ఉపాధి కల్పించడమే కాకుండా అసోసియేషన్ కు ఎంతో సహకరిస్తూ తోడుండే మంచి వ్యక్తి సురేష్ అన్నారు. అలాంటి వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపడాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్ల అందరం ఖండిస్తున్నామని తెలిపారు. తక్షణమే నిందితులను గుర్తించి శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఆర్ ల్యాబ్ గిరి, శేఖర్, రెడిన్ ల్యాబ్ శ్రీనివాస్, వరుణ్ కలర్ ల్యాబ్ వరుణ్, పద్మాలయ శ్రీనివాస్, సిద్ది శ్రీకాంత్, దుర్గారావు, గంగరాజు, పాషా మిక్సింగ్, నజీర్ మిక్సింగ్, మాధురి నగేష్, హనుమంతు, సుభాష్, మిక్సింగ్ శ్రీకాంత్, బొమ్మల నాగరాజు, అంజలి చంద్రశేఖర్, కొక్కు సురేష్, సత్యం, లక్ష్మి దుర్గ రవి, సూర్యాపేట అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.