20-03-2025 10:49:16 PM
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని బహుజన ముక్తి పార్టీ జిల్లా అధ్యక్షుడు బోయిన వేణుగోపాల్ పై దాడి చేసి గాయపరిచిన బిఆర్ఎస్ నాయకునిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బహుజన్ ముక్తి పార్టీ జాతీయ అధ్యక్షులు దాస్ రామ్ నాయక్ డిమాండ్ చేశారు. పాటనంలోని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేణు గోపాల్ ఇంటి సమీపంలో 195 సర్వేనెంబర్ గల ప్రభుత్వ భూమిని అంబేద్కర్ భవనాన్ని నిర్మించుటకు కలెక్టర్లకు ఎమ్మార్వోలకు వినతి పత్రాలు అందచేశారని, దీనిపై స్పందించిన ప్రభుత్వం గత నెలలో ఎమ్మెల్యే, రెవెన్యూ అధికారులు వచ్చి సదరు భూమిని అంబేద్కర్ భవనం నిర్మాణానికి కేటాయించారు.
ఆ స్థలంలో బీఆర్ఎస్ నాయకులు చిప్పరి కూడా మునీందర్ అక్రమంగా రెండు రూములు వేయగా ఇతనికి గొర్ల రామచందర్ మద్దతు తెలిపారని ఆయన వివరించారు. అక్రమ కట్టడాలను వ్యతిరేకించి ప్రభుత్వ భూమిని కాపాడే ప్రయత్నం చేయగా వికలాంగుడు అని కూడా చూడకుండా అతనిపై దాడి చేశారని మండి పడ్డారు. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీస్ అధికారులు భూకబ్జా చేసి అక్రమ కట్టడాలు కడుతున్న వారికే మద్దతు తెలుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై స్థానిక ఎమ్మెల్యే అధికారులు స్పందించి బాధితునికి న్యాయం చేసి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే బహుజన ముక్తి పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు, పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నాలు నిరసనలు తెలుపుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ ముక్తి పార్టీ ఉపాధ్యక్షుడు ఫయీమ్ ఉద్దీన్, ఎరుకల పోరాట హక్కుల సమితి రాష్ట్ర అధ్యక్షులు రేవల్లి శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ వీ ధర్మయ్య, రవీంద్రమాలి తదితరులు పాల్గొన్నారు.