calender_icon.png 19 January, 2025 | 10:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిందితులను కఠినంగా శిక్షించాలి

19-01-2025 12:00:00 AM

సీపీఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు ఓరుగంటి యాదయ్య

ఇబ్రహీంపట్నం, జనవరి 18: విద్యా ర్థులపై లైంగికదాడికి యత్నించిన నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు ఓరుగంటి యాదయ్య అన్నారు. శనివారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఓయో హోటల్ లో మూడు రోజుల కింద మైనర్ బాలికపై, అదేవిధంగా మంగళపల్లిలోని ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతూ హాస్టల్ లో నివాసం ఉంటున్న విద్యార్థినిపై లైంగికదాడికి యత్నించిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.. లైంగికదాడికి యత్నించిన నిందితు లను కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చట్టపరమైన చర్యల్ని తీసుకోవాలని ఓరుగంటి యాదయ్యతోపాటు జాతీయ మహిళా సమాఖ్య నాయకురాలు విజయా, ఏఐవై ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమార్ డిమాండ్ చేశారు.

అంతేకాకుండా హోటల్ యజమాని పైన చట్టపరమైన చర్యలు తీసుకొని, ఓయోని శాశ్వతంగా మూసివే యాలన్నారు. తుర్కయంజాల్ మున్సిపా లిటీ పరిధిలో ఉన్న అన్ని హోటల్స్ పైన సమగ్ర విచారణ జరపాలని, అనుమతులు లేని లాడ్జిలను మూసివేయాలని, అక్రమ హోటల్ వ్యాపారస్తులపై తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుందరమ్మా, నీలా, పద్మ, ప్రసాద్, భాస్కర్, పల్లపు శివ పాల్గొన్నారు.