calender_icon.png 26 December, 2024 | 10:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిందితుడిని కఠినంగా శిక్షించాలి

27-07-2024 03:16:30 AM

మలక్‌పేటలో వీహెచ్‌పీఎస్ నేతల నిరసన

మలక్‌పేట, జూలై 26: మలక్‌పేట అంధబాలికల వసతి గృహంలోని మైనర్ బాలిక (8) పై అఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడిని కఠినంగా శిక్షించాలని వీహెచ్‌పీఎస్ వైస్ చైర్మన్ అందె రాంబాబు, అధ్యక్షుడు గోపాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం మలక్‌పేటలోని వసతి గృహం వద్ద అం ధులతో కలిసి వీహెచ్‌పీఎస్ నేతలు ఆందో ళనకు దిగారు. అఘాయి త్యానికి పాల్పడిన వ్యక్తిని ఉరి తీయాలని వారు డిమాండ్ చేశారు. బాలికపై జరిగిన ఘటనను గోప్యంగా ఉంచడంతో పాటు బాలికను దవాఖానాకు తరలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్, పర్యవేక్షణ చేయని శాఖ డైరెక్టర్, జిల్లా ఏడీను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులనే విచారణ కమిటీలో సభ్యులుగా నియమిస్తే నిజాలు వెలుగులోకి రాకుండా చూస్తారని వారు ధ్వజమెత్తారు. విచారణ కమిటీలో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్లను తక్షణమే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఘటనపై రిటైర్డ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని వారు కోరారు. అన్ని అంధ బాలికల వసతి గృహాల వద్ద ఆడవారిని మాత్రమే స్టాఫ్‌గా నియమించాలని, వార్డ్డన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఈ మేరకు సైదాబాద్ తహసీల్దార్ జయశ్రీ వసతి గృహానికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. సమస్య గురించి ఉన్నతాధికారులకు వివరిస్తానని, ప్రభత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వారికి హామీ ఇచ్చారు.