11-02-2025 01:36:41 AM
కామారెడ్డి, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని బ్రహ్మజివాడి గ్రామంలో దళితులను అవమానించిన నిందితులను కఠినంగా శిక్షించా లని ఎస్సీ, ఎస్టీ, కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య డిమాండ్ చేశారు. సోమవారం బ్రహ్మజివాడి గ్రామానికి వెళ్లి కూరెల్లి రమేశ్‌ను కలిసి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. దళితులపై అవమానకర ఘటనలు జరగడం బాధాకరమన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలకు జరిగిన ఘటన పై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. బ్రహ్మజివాడి గ్రామంలో దళితులపై వివక్షపూరి తంగా అవమానించడం సిగ్గుచేటు అన్నారు.
అనంత రం ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులతో ఫోన్ లో మాట్లాడారు. సమగ్ర విచారణ జరిపి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులకు సరైన న్యాయం జరగకపోతే ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయనవెంట అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్తొళ్ల గంగారం, గౌరవ అధ్యక్షుడు మల్లన్న, ప్రధాన కార్యదర్శి గైని రాజు, చిట్యాల లింగం ఉన్నారు.