calender_icon.png 11 January, 2025 | 4:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిందితులను వదిలేది లేదు

09-07-2024 01:12:44 AM

సోషల్ మీడియాలో తండ్రీకూతురిపై అసభ్యకర వ్యాఖ్యలు

కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి సీతక్క

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): సోషల్ మీడియాలో ఓ చిన్నారిపై కొందరు యవకులు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలపైై రాష్ట్ర మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇలాంటి వ్యాఖ్యలపై ఉపేక్షింది లేదని.. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సో మవారం మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసారని తెలిపారు. తండ్రి, కూతురు మధ్య ఉండే ప్రేమానురాగాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు సరికాదన్నారు. చౌకైన హాస్యం కోసం కుటుంబ బాంధవ్యాలను, మానవ సంబంధాలను అపహస్యం చేస్తూ సోషల్ మీడియాను దుర్వినియోగ పరుస్తున్న అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట పడేలా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రధాన్యత ఇస్తుందని మంత్రి స్పష్టం చేశారు.