calender_icon.png 8 January, 2025 | 4:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందుకే అలా ట్రోల్ చేస్తారనుకుంటా!

18-10-2024 12:35:22 AM

అందుకే అలా ట్రోల్ చేస్తారనుకుంటా!సమంతకు ఎక్కడికి వెళ్లినా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్న ఎదురవుతోంది. ఇప్పటికే ఆ వ్యాఖ్యలపై స్పందించిన సమంత గురువారం ‘సిటాడెల్’ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ మరోసారి స్పందించారు. కొండా సురేఖ వ్యాఖ్యల గురించి రిపోర్టర్ సమంతను ప్రశ్నించగా.. “ఇవాళ నేనిక్కడ ఉండటానికి ఎంతో మంది ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ప్రేమ, నాపై వారి నమ్మకం, మద్దతే కారణం. నాలో వారంతా కష్టాలను ఎదుర్కొనే ధైర్యం నింపారు. నా చుట్టూ ఉన్నవారి వల్లే నేను సమస్యలను ఎదుర్కోగలిగాను“ అని తెలిపారు.

ఆన్‌లైన్ ట్రోలింగ్ లపై సైతం ఆమె స్పందించారు. “ట్రోలింగ్స్ ప్రభా వం నాపై ఎక్కువగా పడకుండా చూసుకుంటా. వారు నా కారణంగా బాధపడి ఉంటారే మో అందుకే అలా ట్రోల్ చేస్తున్నారేమో అనుకుంటా” అని సమంత పేర్కొన్నారు. ప్రస్తుతం సమంత నటించిన ‘సిటాడెల్’ అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ ౭ నుంచి స్ట్రీమింగ్ కానుంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్‌లో సమంత స్పై ఏజెంట్‌గా నటించారు.