హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో క్రిష్ సిరీస్ సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఈ క్రమంలోనే నాలుగో భాగం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే 12 ఏళ్లుగా ఆ ఊసే వినిపించడంలేదు. ఈ సినిమా ఆలస్యానికి కారణాన్ని తాజాగా దర్శకుడు రాకేశ్ రోషన్ వెల్లడించారు.
“క్రిష్ 4’ కోసం మేము ఎంతో ప్రయత్నించాం. కానీ బడ్జెట్ సమకూరడం లేకపోవడంతో ఇది ఆలస్యమవుతోంది. ముందు మూడు భాగాల కంటే నాలుగో భాగానికి ఎక్కువ బడ్జెట్ అవసరమవుతుంది. ఒకవేళ బడ్జెట్ తగ్గిస్తే అది సాధారణ సినిమా అయిపోతుంది. సెల్‌ఫోన్ కారణంగా ప్రపంచం చిన్నదిగా మారిపోయింది.
పిల్లలు కూడా సూపర్ హీరో చిత్రాలను చూస్తున్నారు. కాబట్టి ఏ చిన్న తప్పు చేసినా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. హాలీవుడ్ సూపర్ హీరోల మాదిరిగా భారీ బడ్జెట్‌తో సినిమా తీయడం మన వల్ల కాదు. కాబట్టి నిర్మాతలు సినిమా బడ్జెట్‌పై కాకుండా కథలపై దృష్టి పెట్టాలి” అని రాకేశ్ రోషన్ తెలిపారు.