21-04-2025 12:00:00 AM
మాళవికా మోహనన్.. ఇప్పటివరకు తమిళ, మాలయాళ చిత్రాల్లోనే నటించింది. ‘ది రాజాసాబ్’లో ప్రభాస్‌తో కలిసి తెలుగు ప్రేక్షకులను పలుకరించేందుకు సిద్ధమవుతోంది. అందం వల్ల తనకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో వివరించింది. “ముంబయిలో ఓ రాత్రి నా ఫ్రెండ్స్‌తో కలిసి లోకల్ ట్రైన్‌లో వెళ్లా. ఆ కంపార్ట్‌మెంట్‌లో మేం తప్ప ఎవరూలేరు. అదే టైమ్‌లో ఓ వ్యక్తి అందులోకి వచ్చేందుకు ప్రయత్నించాడు.
కంపార్ట్‌మెంట్ వద్ద ఉన్న గ్యాస్ డోర్ నుంచి తొంగిచూస్తూ ముద్దిస్తావా అని సైగలు చేశాడు. మేమంతా భయపడ్డాం.. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక 10 నిమిషాల తర్వాత మరో స్టేషన్‌లో కొందరు ప్యాసింజర్స్ మాకు తోడవటంతో ఊపిరి పీల్చుకున్నాం” అని తెలిపారు. ఇక హీరోయన్ల లుక్ గురించి చెప్తూ.. “హీరోయిన్స్ లుక్స్ విషయంలో ప్రతి ఇండస్ట్రీలో కొన్ని ప్రమాణాలున్నాయి.
నేను కొంచెం బరువు పెరిగి ముంబయిలో సినిమాలు చేయాలనుకుంటే అది తప్పే. వెంటనే బరువు తగ్గామని నా మేనేజర్ చెప్తాడు. కొంచెం సన్నబడి చెన్నై వాళ్లను పని అడిగితే.. వాళ్లు ఏమాత్రం అంగీకరించరు. నువ్వు బొద్దుగా ఉంటేనే బాగుంటావు.. కొంచెం బరువు పెరగమని సూచిస్తారు. ఇలాంటి కొన్ని పరిస్థితుల తర్వాత నేను లావుగా ఉండాలా? లేదా సన్నబడాలా? అనే విషయంలో గందరగోళానికి గురయ్యా.
మెల్లగా పరిస్థితులు అర్థం చేసుకున్నా. ఏదిఏమైనా ఆరోగ్యం, ఫిట్‌గా ఉండాలని నిర్ణయించుకున్నా. అయితే, స్త్రీల శరీరాకృతిపై తరుచూ విమర్శలు వస్తూనే ఉంటాయనేది గుర్తుపెట్టుకుంటే సరి. 21 ఏళ్లకే నటిగా కెరీర్ ప్రారంభించిన నేను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో లుక్స్ పరంగా విమర్శలు ఎదురయ్యాయి. నా ఫస్ట్ మూవీ విడుదలైనతర్వాత చాలా సన్నగా ఉన్నానని ట్రోల్స్ చేశారు..
ఆ తర్వాత నా శరీరాకృతి ఎంతో మారింది.. కొంచెం బొద్దుగా అయ్యా.. అప్పుడూ కామెంట్స్ చేశారు! వాళ్ల మాటలు నన్నెంతో బాధించాయి. సౌత్ మూవీస్‌లో నటించాలనుకునే అమ్మాయి కాస్త బొద్దుగా ఉండాలి. ఇక్కడివాళ్లు.. హీరోయిన్ల బొడ్డు మీదే ఎక్కువ ఫోకస్ పెడతారు. హీరోయిన్స్ కూడా ఎక్కువగా తమ బొడ్డు కనిపించేలా తీయించుకున్న ఫొటోలనే సోషల్‌మీడియాలో పెడుతుంటారు” అని మాళవికా మోహనన్ వెల్లడించారు.