calender_icon.png 1 January, 2025 | 12:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందుకే మస్క్ అంటే ఇష్టం

07-11-2024 02:04:52 AM

టెస్లా అధినేతపై ట్రంప్ ప్రశంసల వర్షం

ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌పై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల స్పేస్‌ఎక్స్ సాధించిన విజ యాన్ని గుర్తు చేస్తూ మస్క్‌ను అద్భుతమైన వ్యక్తిగా అభిర్ణించారు. స్పేస్‌ఎక్స్ ప్రయో గాలు చేయడం చైనా, రష్యా కాకుండా కనీసం అమెరికా వల్లునా అవుతుందా అని ప్రశ్నించినట్టు పేర్కొన్నారు.

అటువంటి అద్భుతమైన ప్రయోగాలు చేస్తున్నందువల్లే తనకు మస్క్ అంటే ఇష్టమన్నారు. మస్క్ వంటి అరుదైన వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారనీ అలాంటి వారిని మనం కాపాడుకోవాలని పేర్కొన్నారు. ట్రంప్ విజ యం పట్ల మస్క్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

మార్పు కోసం అమెరికా ప్రజలు స్పష్టమైన ఆదేశాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. అంతకుముందు ‘గేమ్, సెట్ అండ్ మ్యాచ్’ అంటూ ట్వీట్ చేశారు. సాధారణంగా ఈ పదాలను టెన్నిస్‌లో ఓ ఆటగాడు గెలిచాడని చెప్పడానికి ఉపయోగిస్తుంటారు. 

ట్రంప్ గెలుపులో మస్క్ పాత్ర

ఇదిలా ఉంటే ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడం వెనక మస్క్ కృషి కూడా ఉంది. గత ఎన్నికల్లో ట్రంప్‌కు పరోక్షంగా మద్దతు తెలిపిన మస్క్, ఈ ఎన్నికల్లో ఒక అడుగు ముందుకేసి ప్రత్యక్షంగా సపోర్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా బైడెన్ వైఫల్యాలను ఎండగడుతూ అమెరికన్లు ఎదుర్కొం టు న్న సమస్యలు ప్రస్తావించారు.