- భారీ బోర్డింగ్ పాస్‌తో వచ్చిన ప్రయాణికుడు
- ఎయిర్‌పోర్ట్‌లో సరదా సన్నివేశం..
- సోషల్ మీడియాలో వైరల్
న్యూఢిల్లీ, జనవరి 5: కొందరు సరదా వ్యక్తులు ఉంటారు. వారు చేసే పనులు ఇతరులను తెగ నవ్విస్తుంటాయి. తాజాగా ఇలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ వ్యక్తి ఎయిర్‌పోర్ట్ లోకి ప్రవేశిస్తాడు. ఎంట్రన్స్ దగ్గర ఉన్న తనిఖీ అధికారులు సదరు వ్యక్తిని బోర్డింగ్ పాస్ చూపించమని కోరుతారు. ఇంతలో ఆ వ్యక్తి తన బ్యాగులో ఉన్న ఓ పెద్ద పేపర్ ప్రింట్‌ను తీసి వారికి చూపిస్తాడు.
దాన్ని చూసిన ఆ అధికారులు కంగుతింటారు. బోర్డింగ్ పాస్ చూపించమంటే పోస్టర్ చూపిస్తున్నావని అంటారు. దానికి అతడు అదే తన బోర్డింగ్ పాస్ అంటాడు. దాన్ని చూసిన తనిఖీ అధికారులు తెగ నవ్వుతారు. దానిలో ఉన్న వివరాలను ఆ వ్యక్తి చెపుతుంటే అక్కడున్న వారు సైతం నవ్వు ఆపు లేకపోతారు. ఈ వీడియోకు “ మీ బోర్డింగ్ పాస్‌ను ప్రింట్ చేయమని మీ ఫ్రెండ్స్‌ను అడుగొద్దు” అనే టెక్ట్స్ పెట్టారు.
కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఇదే సమయంలో ట్రావెల్ కంపెనీ మేక్ మై ట్రిప్ కూడా ఫన్నీగా స్పందించింది. “కాగితాన్ని సేవ్ చేయండి.. మీరు టికెట్ బుక్ చేసుకుని వాట్సాప్‌లో చూపించండి.. ప్రయాణాన్ని ఆస్వాదించండి..” అంటూ ట్వీట్ చేసింది.