17-03-2025 12:34:46 AM
రామ్‌చరణ్, బుచ్చిబాబు కాంబోలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘ఆర్‌సీ16’ అనే మేకింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్. దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను నేటివిటీ స్టుల్ కథనానికి హై ఇంటెన్స్ స్పోర్ట్స్ డ్రామాను మిక్స్ చేసి తెరకెక్కిస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో కథానాయకుడి రోల్ గురించి నెట్టింట ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రామ్‌చరణ్.. అద్దె క్రీడాకారుడిగా కనిపిస్తారని వినవస్తోంది.
క్రికెట్, కబడ్డీ, వాలీబాల్.. ఇలా ఏ క్రీడ అయినా డబ్బు ఇస్తే.. ఆ జట్టు తరఫున ఆడే ఆటగాడి పాత్రను పోషిస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. పెద్దగా గ్రాఫిక్స్ లాంటివి లేనందున వీలైనంత త్వరగా పనిపూర్తి చేసి ఇదే ఏడాది విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్.