calender_icon.png 9 February, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడిక్ట్ అయితే అంతే!

09-02-2025 12:13:17 AM

ఐదేళ్ల నుంచి పదిహేనేళ్ల ఏళ్లలోపు పిల్లలు రోజూ సోషల్ మీడియాలో మూడు నుంచి ఆరుగంటలు సమయం వెచ్చిస్తున్నట్లు పలు సర్వేల్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దీని కారణంగా పిల్లలు ఫిజికల్‌గా, స్టడీల్లో కూడా చురుగ్గా ఉండట్లేదని గుర్తించారు. మొబైల్ గేమ్స్ ఆడడానికి చూపిస్తున్న శ్రద్ధ.. అవుట్ డోర్ గేమ్స్ ఆడేందుకు చూపించట్లేదు. సోషల్ మీడియా, ఓటీటీల ఎఫెక్ట్ పిల్లల్లో మానసికంగా ప్రతికూలమైన ప్రభావాలు చూపిస్తున్నట్లు గుర్తించారు. అలాంటి పిల్లలను గుర్తించి వెంటనే జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటున్నారు మానసిక నిపుణులు. 

ఇష్టమైన కథలు

మంచి బొమ్మలతో ఉండే కథల పుస్తకాలు, సాహిత్యం వంటివి ఇచ్చి చదువుకోమనొచ్చు. వీటి వల్ల పిల్లలు ఫోన్లకు దూరం అవుతారు. 

ఇతర కార్యక్రమాలు

పిల్లలకు రకరకాల కళల్లో వారిని బిజీగా ఉంచే ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు సంగీతం, పేయింటింగ్, డ్యాన్స్ ఇలా వారికి వేటిపై ఇష్టముందో తెలుసుకుని వాటిని నేర్చుకునేలా చేయండి. దీని వల్ల వారు కొత్త విషయాలని నేర్చుకుంటారు. దీంతో పిల్లల ఫోన్ వాడకం తగ్గుతుంది.

ఆరుబయట కాసేపు

ఇంతకుముందు కాలంలో పిల్లలు బయట ఎక్కువగా ఆడుకునేవారు. కానీ, ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు అలా ఆడుకోనివ్వట్లేదు. ఇంట్లోనే బొమ్మలు కొనిచ్చి ఆడుకోమంటున్నారు. వీటి వల్ల పిల్లలు బోర్‌గా ఫీల్ అవుతారు. అలా కాకుండా ఉండాలంటే పిల్లల్ని బయటకి పంపించి ఆడుకోనివ్వండి. కొత్తగా పరిచయాలు, స్నేహాలు మొదలైతేవారు ఫోన్స్, టీవీల నుంచి దూరమవుతారు. బయట ఆడుకుంటారు. దీంతో మానసికంగా హెల్దీగా ఉంటారు.