09-02-2025 01:48:41 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): అవినీతికి వ్యతిరేకంగా పోరా డతామని రాజకీయాల్లోకి వచ్చిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. చివరకు ఆయనే అందుకు చిరునామాగా మా రారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. అవినీతిలో కూరుకుపోతే ఏమవుతుందో చెప్పేందుకు ఢిల్లీ ఫలితాలే చక్కటి ఉదాహరణ అని పేర్కొన్నారు.
శనివారం కిషన్‌రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్, సిసోడియా లాంటి నాయకులను ఢిల్లీ ప్రజలు ఓడించారన్నారు. లిక్కర్ స్కామ్, వాటర్ స్కామ్, షీష్ మహల్ నిర్మాణం, ఆప్ మంత్రు లు, ఎమ్మెల్యేల అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూ స్తుంటే జాలిగా ఉందన్నారు.
రాహుల్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇది ఎన్నో ఓటమో లెక్కపెట్టాల ని, ఢిల్లీలో వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ డకౌట్ అయ్యిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు గెలవాలనే ఆలోచనే ఉండదని, మోదీని, బీజేపీని ఓడించాలని మాత్రమే రాహుల్‌గాంధీ ఆలోచన చేస్తారన్నారు. రాహుల్ గాంధీ రాజ్యాం గం చేతిలో పట్టుకొని తిరగడం కాదని, రాజ్యాంగ విలువలు పాటించాలన్నారు.
కేజ్రీవాల్ నాయకత్వంలోనే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగినట్లు ప్రజలు నమ్మారని, అందు కే ఈ ఫలితాన్ని ఇచ్చారన్నారు. కేజ్రీవాల్ ఉచిత హామీలను ప్రజలు నమ్మలేదన్నారు. జైలు నుంచే పరిపాలన చేసిన కేజ్రీవాల్ డ్రామాలను ప్రజలు తిప్పికొట్టారన్నారు. పదేళ్లుగా అభివృద్ధికి నోచుకోని ఢిల్లీలో ఇకపై అభివృద్ధి జరగనుందని కిషన్‌రెడ్డి తెలిపారు.
ప్రజలు ఒకసారి నిర్ణయం తీసుకుంటే కేజ్రీవాల్ అయినా, రాహు ల్ గాంధీ అయినా, కేసీఆర్ అయినా మార్చలేరన్నారు. హర్యానాలో బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ద్వారా, ఆప్ పార్టీ తమ నీఛ రాజకీయాలను బయట పెట్టుకుందన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తారని కాంగ్రెస్ గతంలో తప్పు డు ప్రచారం చేసినా ప్రజలు వారి మా టలను నమ్మలేదని చెప్పారు.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మహారాష్ర్ట ఎన్నికల ప్రచారానికి వెళ్లి, తెలంగాణను అభివృద్ధి చేస్తున్నామంటూ ఫ్రం ట్ పేజ్ ప్రకటనలు ఇచ్చినా.. కాంగ్రెస్ కేవలం 16 సీట్లు గెలుచుకుందని, ఢిల్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి గుండుసున్నే మిగిలిందన్నారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో రాహుల్ గాంధీ నాయకత్వంలోని మహావికాస్ అఘాడీని గతంలో ఎన్నడూలేని విధంగా నరేంద్ర మోదీ నాయకత్వంలోని మహాయుతి కూటమి చిత్తుచిత్తు చేసిందని గుర్తుచేసుకున్నారు. మహారాష్ర్ట లో దొంగఓట్లు నమోదు చేశారని, అందుకే కాంగ్రెస్ పార్టీ ఓడిందని రాహుల్ గాంధీ మాట్లాడటాన్ని చూ స్తుంటే..
కనీసం ప్రజల తీర్పును ఒప్పుకునేందుకు కూడా వారు సిద్ధంగా లేరని తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ ఢంకా మోగడం ఖయమని ధీమా వ్యక్తం చేశారు. గతంలో అవినీతికి వ్యతిరేకంగా చేసిన అన్నాహజారే ఉద్యమానికి అందరం స్వాగతం పలికామ ని, కానీ కలుపుమొక్కలా కేజ్రీవాల్ బయటకు వచ్చి, ప్రజలను న మ్మించి అధికారంలోకి వచ్చారన్నారు.