calender_icon.png 7 February, 2025 | 4:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ మహిళది సుపారి హత్య

07-02-2025 01:49:10 AM

* ప్రియుడి కుటుంబ సభ్యులే చంపించారు!

* చొప్పదండి సీఐ వెల్లడి

చొప్పదండి, ఫిబ్రవరి 6: జనవరి 27న గంగాధర మండలం కురిక్యాల గ్రామ శివారులో ఎస్సారెస్పీ కాకతీయ కాలువ సమీ  కరీంనగర్ జాతీయ రహదారి పక్కన సుమారు 25 సంవ   వయస్సు గల గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. గంగాధర పోలీసు  కేసు దర్యాప్తు చేసి, ఆమెది హత్యగా తే  గురువారం చొప్పదండి సీఐ ఆర్ ప్ర  వివరాలు వెల్లడించారు.   

మంచిర్యాల కు చెందిన మమత తన భర్తతో మన   రావడంతో మంచిర్యాలలోని తిలక్‌నగర్  ఉంటూ క్యాటరింగ్ పనిచేస్తుండేది. మం  జిల్లా రామకృష్ణాపూర్‌కు చెందిన కు  భాస్కర్ సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నాడు. మమతతో భాస్కర్‌కు ఏర్పడిన ప రిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. భాస్కర్ తన జీతం మమతకే ఇస్తూ తన కుటుంబాన్ని పట్టించుకోవడంలేదు.

అతడి నుంచి మమతను దూరం చేయాలనే ఉద్దేశంతో భాస్కర్ అక్క నర్మ  ఆమె స్నేహితుడు రఘు, భాస్కర్ తండ్రి రాయలింగు, బావ వెంకటేష్‌తో కలిసి పథకం రచించారు. మమతను హత్య చేయడానికి వేల్పుల కళ్యాణ్‌తో రూ.5 లక్షలకు డీల్ మాట్లాడుకుని రూ.60 వేలు అడ్వాన్స్ ఇచ్చారు.

జనవరి 25న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మమత తన నాలుగు సంవత్సరాల బాబు ను తీసుకొని బయటకు వెళ్లి, శవమై కనిపించింది. మృతురాలు ఉంటున్న ప్రాంతంలో సీసీ ఫుటేజీలు చూడగా ఓ కారులో ఎక్కినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ కారును కళ్యాణ్ కిరాయికి తీసుకు  సెల్ఫ్ డ్రైవింగ్ చేసినట్టు గుర్తించారు.

కళ్యాణ్‌తో పాటు మ మత కుమారుడు చెన్నైలో ఉంటున్నట్టు గు ర్తించారు. పోలీసులు చెన్నైకి వెళ్లగా అక్కడ హోటల్‌లో మమత కుమారుడ్ని నిందితుడు విడిచిపెట్టి పారిపోయాడు. ఆ బాబును మృ తురాలి అత్తామా  అప్పగించామని పోలీసులు తెలిపారు.

ఈ నెల 5న గంగాధర ఎస్సై సిబ్బం  గంగాధర మండ లం వెంకటాయపల్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా లక్షేట్టిపేట్టలోని బాస్‌నగర్‌కు చెందిన నిందితుడు వేల్పుల కళ్యాణ్(26)ను అరెస్టు చేసినట్టు తెలిపారు. కాగా మమతను హత్య చేసిన అనంతరం కళ్యాణ్‌కు రూ.4 లక్షలు భాస్కర్ కుటుంబీకులు ఇచ్చారని పోలీసులు తెలిపారు.