calender_icon.png 19 October, 2024 | 3:56 AM

గడువు అందుకే తగ్గించాం

19-10-2024 01:56:21 AM

అడ్వాన్స్ టికెట్ల కాలపరిమితి తగ్గింపుపై రైల్వే బోర్డు వివరణ

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: రైల్వే టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ గడువు 60 రోజులకు కుదిస్తూ తీసుకున్న నిర్ణయంపై రైల్వే బోర్డు వివరణ ఇచ్చింది. గడువు సమయం ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువగా టికెట్లు రద్దు అవుతున్నాయని, దీం తో బెర్తులు వృథా పెరుగుతోందని వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న 120 రోజుల గడువు వల్ల 21 శాతం క్యాన్సిలేషన్లు అవుతున్నాయి. 4 శాతం మంది ప్రయాణం చేయడం లేదు.

వాళ్లు టికెట్ కూడా రద్దు చేయకపోవడంతో బెర్తులు వృథాగా పోతున్నాయి అని వివరించింది. ఇది పలురకాల మోసా లు, అక్రమాలకు కారణమవుతోందని తెలిపింది. గడువు ఎక్కువగా ఉండటం వల్ల ముం దుగానే సీట్లను బ్లాక్ చేసుకుంటున్నారని, అందువల్ల నిజమైన ప్ర యాణికులకు నష్టం జరుగుతోందని పేర్కొంది.