- మేం గేట్లు తెరిచామో బీఆర్‌ఎస్ ఖాళీ
- ప్రభుత్వ విప్ లక్ష్మణ్
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): కేసీఆర్ గడీల పాలన చేయ డం వల్లే ఓడిపోయాడని, పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఒక్క రోజు కూడా సెక్రటేరియేట్‌కు ఎందుకుపోలేదని ప్రభుత్వ విప్ అడ్లూ రు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ఇప్పుడు సీ ఎం రేవంత్ రెడ్డి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని చెప్పుకొచ్చారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. అధికారం కోల్పోయిన ఆరు నెలల్లోనే బీఆర్‌ఎస్ కను మరుగైందని, తమ ప్రభుత్వాన్ని కూ లగొడుతామని బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారని, ఇలాగే మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు తగిన బుద్ది చెబుతారన్నారు. తాము గేట్లు తెరిస్తే.. బీఆర్‌ఎస్‌లో నాయకులతో సహా ఒక్క కార్యకర్త కూడా మిగలరని హెచ్చరించారు. ఓడినా కేసీఆర్‌కు బుద్ది రాలేదన్నారు.
హామీ మేరకు రుణమాఫీ: ఎమ్మెల్యే విజయ రమణారావు
రైతులకు ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తారని ఎమ్మెల్యే విజయ రమణారావు పేర్కొన్నారు. రైతులకు రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. కేసీఆర్ మెదడు సరిగా పని చేయడం లేదని, అందుకే ప్రభు త్వం కూలిపోతుందని అంటున్నారని ఫైర్ అయ్యారు.