calender_icon.png 27 December, 2024 | 12:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందుకే డార్లింగ్ అంటారు

05-12-2024 12:00:00 AM

బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు వచ్చిన హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. 2018లో ‘సవ్యసాచి’ సినిమాతో తెలు గు తెరకు పరిచయమైంది. ప్రస్తుతం ప్రభాస్‌తో ‘రాజాసాబ్’, పవన్ కల్యాణ్‌తో ‘హరిహర వీరమల్లు’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తోందీ బ్యూటీ. ఈ నేపథ్యంలో నిధి అగర్వాల్ తాజాగా ఆన్‌లైన్ లో అభిమానుల ముందుకొచ్చింది. ‘ఆస్క్ నిధి’ పేరుతో నిర్వహించిన ఈ చిట్‌చాట్ ఆద్యతం ఆసక్తికరంగా సాగింది.

తొలుత ఓ నెటిజన్ ‘మీకు తెలుగు వచ్చా మేడమ్?’ అని అడగ్గా దానికి నిధి అగర్వాల్ ఆసక్తికరంగా బదులిచ్చింది. ‘నాకు తెలుగు వస్తుందండీ.. ఎందుకు మీకు ఆ డౌట్? అందరికీ నమస్కారం’ అని చెప్పే బ్యాచ్ కాదు నేను’ అని ఫన్నీగా సమాధానమిచ్చింది. మరికొన్ని ప్రశ్నలకు ఆమె ఇచ్చిన జవాబుల సమాహారమిది.. “రాజాసాబ్’, ‘హరిహర వీరమల్లు’ చిత్రాలతో హీరోయిన్‌గా ప్రేక్షకులకు మరింత చేరువవుతానన్న నమ్మకం నాకుంది.  ప్రభాస్, నేను సెట్‌లో ఎంతో సరదాగా పని చేశాం.

అందరూ ఆయన్ను డార్లింగ్ అని ఎందుకు అంటారో ఈ సినిమాతోనే తెలిసింది” అని చెప్పుకొచ్చిందీ చిన్నది. ఇక ‘హరిహర వీరమల్లు’లో తాను పంచమిగా నటించా నని, ఈ పాత్రతో నటిగా నాలోని పలు కోణాలు ఆవిష్కరించే అవకాశం లభించింది’ అని తెలిపింది. ఈ సినిమాలోని లవ్ ట్రాక్ గురించి వివరిస్తూ.. ‘వీర ప్రేమకథ బాగుంటుంది’ అని చెప్పింది. హరిహర వీరమల్లు పార్ట్ 2 ఎప్పుడు అని అడిగితే ‘మీరు అనుకున్న టైమ్ కన్నా ముందే వస్తుందని తెలివిగా బదులిచ్చింది.