calender_icon.png 30 October, 2024 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ వీడియో పాతది

30-10-2024 02:17:36 AM

స్వామి రామభద్రాచార్య వీడియోపై అభివన్ ఆరోరా ప్రకటన

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: స్వామి రామభద్రాచార్య తనను తిట్టినట్లు వైరల్ అయిన వీడియోపై తాజాగా అభినవ్ అరోరా స్పందించారు. స్వామీజీ తనపై అసహనం వ్యక్తం చేసినట్లుగా వైరల్ అయిన వీడియో ఇప్పటిది కాదన్నారు. ఆ వీడియో ఏడాదిన్నర క్రితం బృందావన్‌లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిందని చెప్పారు.

కానీ ప్రతాప్ గంజ్‌లో చోటు చేసుకున్న వీడియోగా దాన్ని కొందరు ప్రచారం చేస్తు న్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా శిష్యు లు గురువుల వద్ద తిట్లు తినడం సాధారణ మే అన్నా రు. తల్లిదండ్రులు, గురువుల వద్ద తిట్లు తినడాన్ని అసాధారణ విషయంగా చూడొద్దన్నారు.

కాగా.. తన ను తాను ఆధ్యాత్మిక ప్రవచనకర్తగా ప్రచారం చేసుకుంటున్న ఈ బాలు డు సెప్టెంబర్‌లో గణేష్ నిమజ్జనం సందర్భంగా విగ్రహాన్ని కౌగిలించుకుని హడావిడి చేయడంతో మొట్ట మొదటి సారి గా ప్రజల దృష్టిని ఆకర్షించాడు.

ఆ తర్వాత స్వామి రామభద్రాచార్యతో వేదికను పంచుకుంటూ మరో వీడియోలో కనిపిం చాడు. ఆ వీడియోలోనే ప్రసంగానికి ఆటంకం కలిగిస్తున్నాడనే కారణంతో అభినవ్ అరోరాపై స్వామి రామభద్రాచార్య అసహనం వ్యక్తం చేసి, వేదిక నుంచి కిందికి దిగిపోవాల్సిందిగా ఆదేశించారు.