calender_icon.png 21 October, 2024 | 7:20 AM

ఆ వీడియో నాదే, కానీ!

30-07-2024 12:05:00 AM

ఊర్వశీ రౌతేలా.. బాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో వచ్చిన ‘బ్రో’ సినిమాలోని ‘మై డియర్ మార్కండేయ’ అనే ప్రత్యేక గీతంలో, ‘స్కంద’లోని ‘కల్ట్ మామా’ సాంగ్‌లో, ‘వాల్తేరు వీరయ్య’లో మూవీలోని ‘బాస్ పార్టీ’ గీతంతోపాటు ‘ఏజెంట్’ చిత్రంలోని ‘వైల్డ్ సాలా’ గీతంలో తనదైన హాట్‌హాట్ స్టెప్పులతో టాలీవుడ్ ప్రేక్షకులకూ సుపరిచితురాలయ్యింది. ఇలా స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్ట్‌గా, వివాదాలకు కేరాఫ్‌గా ఉండే ఈ సుందరి బాత్రూమ్‌లో బట్టలు విప్పుతున్న వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది ఆమె ప్రైవేట్ వీడియో అనీ, పబ్లిసిటీ స్టంట్ అనీ వార్తలు వచ్చాయి.

ఊర్వశీ రౌతేలా ప్రైవేట్ వీడియో లీక్ అయ్యిందంటూ వార్తలు వచ్చిన దరిమిలా ఆమె తన మేనేజర్‌పై కోప్పడిన వీడియో సైతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. అయితే, తాజాగా మీడియా కంట పడిన ఈ భామను వాకబు చేస్తే.. బాత్రూమ్‌లో టాప్ విప్పిన వీడియో వెనుక ఉన్న టాప్ సీక్రెట్ గురించి చెప్పేసింది. “ఆ వీడియో వైరల్ కావటంతో నేను కలత చెందాను. ఇలాంటి పరిస్థితి ఏ మహిళకూ రావొద్దు. ఆ వీడియోలో ఉన్నది నేనే కానీ, అది వ్యక్తిగతమైనది కాదు. అది ‘ఘుస్సైతియే’ సినిమాలోని సన్నివేశం. ఆ చిత్రంలో నేనలా బట్టలు విప్పే సీన్ ఉంటుంది” అని చెప్తూ వైరల్ న్యూస్‌కు పుల్‌స్టాప్ పెట్టేసింది ఊర్వశి.