calender_icon.png 22 January, 2025 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యరంగానికి అంతంతే

24-07-2024 01:29:37 AM

హెల్త్‌కు రూ.90 వేల కోట్ల కేటాయింపు

గతేడాదితో పోలిస్తే రూ.10 వేల కోట్ల పెంపు

కొన్ని ఔషధాలకు మాత్రం అధిక ప్రాధాన్యం

క్యాన్సర్ చికిత్సలో 3 మందులకు ట్యాక్స్ ఎత్తివేత

న్యూఢిల్లీ, జూలై 23: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి స్వల్పంగా కేటాయింపులు పెంచారు. గతేడాది రూ.80వేల కోట్లు ఇవ్వగా ఈ సారి రూ.90 వేల కోట్లు కేటాయించారు. వైద్యరంగంలో భాగంగా ఆయుష్ మంత్రిత్వశాఖకు రూ.3,712 కోట్లు కేటాయించారు. గతేదాడి ఇది రూ.3 వేల కోట్లుగా ఉంది. మొత్తం ఆరోగ్య రంగానికి చెందిన రూ.90,958 కోట్లలో రూ. 87,656 కోట్లు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖకే కేటాయించడం గమనార్హం. మిగిలిన రూ.3,301 కోట్లు ఆరోగ్య పరిశోధన శాఖకు విదిల్చారు. 

క్యాన్సర్ బాధితులకు ఊరట

ఈ బడ్జెట్‌లో మూడు క్యాన్సర్ చికిత్స మందులపై కస్టమ్స్ డ్యూటీని ఎత్తివేయడం విశేషం. క్యాన్సర్ బాధితులకు ఊరటనిచ్చేందుకు ఈ ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని 10 శాతం నుంచి సున్నాకు తగ్గించినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఎక్స్‌రే ట్యూబ్స్, ఫ్లాట్ ప్యానెల్ డిటెక్టర్లు ధరల్లోనూ సవరణలను ప్రతిపాదించినట్లు తెలిపారు. 

ఆరోగ్య సంస్థలకు నిధుల పెంపు

ఆరోగ్య బడ్జెట్‌లో కేంద్ర పథకాలకు రూ.36 వేల కోట్లు కేటాయించగా ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కోసం రూ.7,300 కోట్లు అందించనున్నారు. జాతీయ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ కింద రూ.90 కోట్లు, జాతీయ డిజిటల్ హెల్త్ మిషన్ కింద రూ.200 కోట్లు కేటాయించారు. ఆరోగ్య శాఖలో అటనామస్ సంస్థలకు నిధులు పెంచుతూ రూ.18,013 కోట్లు అందించనున్నారు. ఇందులో ఢిల్లీ ఎయిమ్స్‌కు రూ.4,523 కోట్లు కేటాయించారు. ఇందులో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)కు రూ.2,732 కోట్లు దక్కాయి.