‘హసీన్ దుల్‌రుబా’తో 2021లో విజయాన్ని అందుకుంది నటి తాప్సీ. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా’లో తాప్సీ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. శుక్రవారం (నేడు) ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాప్సీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా హసీన్ చిత్రంలో తాను ఎలా భాగమైందో వివరించింది. ‘నేనొక విభిన్నమైన కథతో సినిమా చేయాలనుకుంటున్నానంటూ డైరెక్టర్ కనికా ధిల్లాన్ ఓసారి నాకు చెప్పారు. ఆ కథ వినేందుకు నేనెంతో ఆసక్తిగా ఉన్నానని ఆమెకు తెలియజేశాను. అయితే, అదే సమయంలో నేను మరో సినిమా షూటింగ్‌లో బిజీగా అయ్యాను.
ఆ చిత్రం షూటింగ్ పూర్తయ్యేసరికి కనికా మరో నటిని సంప్రదించారని, వారిద్దరి మధ్య ఒప్పందం కుదిరిందని, త్వరలో ఆ సినిమా పట్టాలెక్కనుందని వార్తలు వచ్చాయి. కొన్ని నెలల తర్వాత కనికా ఫోన్ చేసి.. ఎందుకు? ఏమిటి? అని ప్రశ్నించకుండా స్క్రిప్ట్ నరేషన్ కోసం ఆఫీసుకు రమ్మని పిలిచింది. స్క్రిప్ట్ విన్న వెంటనే ఈ కథ నాకోసమే రాసినట్టు అనిపించింది. వెంటనే ఆ ప్రాజెక్టుకు ఓకే చెప్పా. ఇలా అనుకోని కారణాల వల్ల ఆ నటి నటించకపోవటంతో నాకు ఈ సినిమాలో నటించే అవకాశం అనుకోకుండా వచ్చింది’ అని తాప్సీ తెలిపింది. తాప్సీ మిగతా సినిమాల విషయానికొస్తే.. ‘వో లడికీ హై కహాన్’ చిత్రం గురువారం విడుదలైంది.
ఇందులో ఆమె కథానాయికగా కనిపింది. ఆమె హీరోయిన్‌గా నటించిన మరో బాలీవుడ్ సినిమా ‘ఖేల్ ఖేల్ మే’ ఇదే నెల 15న విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది తాప్సీ. ఇదిలా ఉండగా, దర్శకుడు మహి వి.రాఘవ తెరకెక్కించిన ‘ఆనందో బ్రహ్మ’కు త్వరలో సీక్వెల్ పట్టాలెక్కనుందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ ప్రాజెక్టులో తాప్సీనే హీరోయిన్ అని టాక్.