calender_icon.png 23 January, 2025 | 10:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ పరిస్థితి ఎంతో ఇబ్బందికరం

14-08-2024 12:05:00 AM

కెరీర్‌పరంగా సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతున్న కృతిసనన్.. తనకంటే పదేళ్ల చిన్న వయస్కుడితో డేటింగ్ చేస్తోం దంటూ ఇటీవల ఊహాగానాలు వినిపించాయి. ఆమె పుట్టిన రోజు వేడుకను యూకేకు చెందిన కబీర్ బహియాతో కలిసి చేసుకున్నారని ప్రచారం జరిగింది. ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారని కూడా రూమర్స్ వచ్చాయి. ఈ వార్తలపై కృతిసనన్ స్పందించింది. “తన కంటే 10 ఏళ్ల చిన్న వ్యక్తితో 34 ఏళ్ల కృతి డేటింగ్’ అనే హెడ్డింగ్ ఎంతో మంది ఉపయోగించారు. ఏ మాత్రం నిజానిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు రాసేశారు.

ఇలా రాయడం ఈ రోజుల్లో సాధారణమైపోయింది. నా గురించి తప్పుడు సమాచారాన్ని రాసినప్పుడు, అవి నిజమని చాలా మంది నాకు మెస్సేజ్‌లు చేస్తున్నారు. దానివల్ల వచ్చే పరిణామాలను నాతోపాటు నా కుటుంబ సభ్యులు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. అలాంటి పరిస్థితి అన్నిటికంటే ఎంతో ఇబ్బందికరంగా, బాధగా ఉంటోంది. ఎలాంటి వార్తలైనా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి త్వరగా వెళ్తాయి. ఈ అబద్ధాల గురించి నిరంతరం స్పందించాలంటే చికాకు వేస్తోంది.

గతంలో సోషల్ మీడియా లేనప్పుడు వార్తాపత్రికల్లో వచ్చింది చూసి ప్రజలు ఓ అభిప్రాయానికి వచ్చేవారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు రాస్తున్నారు. నెగెటివ్ కామెంట్స్ పెట్టడమనేది ట్రెండ్ అయిపోయింది. అయితే తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయ టం.. ఇతరులపై రూమర్స్ క్రియేట్ చేయటం ఒక్కటి కాదు కదా!” అంటూ అసహనం వ్యక్తం చేసింది.