మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): వంద శాతం మురుగునీటిని శుద్ధి చేసిన తొలి భారతీయ నగరంగా హైదరాబాద్ అవతరించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు పేర్కొ న్నారు. ఎక్స్‌లో ఆయన స్పందిస్తూ.. రూ. 3866 కోట్లతో కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఫలించిందని తెలిపారు. మూసీ పునరుజ్జీ వం, తదుపరి సుందరీకరణకు ఇది మొదటి అడుగుగా ప్రణాళిక చేయబడిందన్నారు. దీని కోసం గ్లోబల్ డిజైన్ టెండర్లు పిలిచినట్లు, మాప్రణాళిక, ప్రయత్నా లు ఫలిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.