బీజేపీ రాష్ర్ట అధికార ప్రతినిధి రాణీరుద్రమ
హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): వికా రాబాద్ జిల్లా లగిచెర్లలో ఏర్పాటు చేయాలనుకుంటున్న ఫార్మా కంపెనీ సీఎం బావమరిది సృజన్‌రెడ్డిదని.. గతంలో ఆ కంపెనీలో రేవంత్‌రెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీరుద్రమ ఆరోపించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో ఆమె విలేకరులతో మాట్లాడారు.
రేవంత్, కల్వకుంట్ల కవితకు బినామీగా సృజన్‌రెడ్డి చాలా వ్యాపారాలు చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ హయాం లో కల్వకుర్తి లిఫ్ట్ పనులు కూడా సృజన్‌రెడ్డి కంపెనీకే దక్కాయని గుర్తు చేశారు. కల్వకుంట్ల, రేవంత్ కుటుంబాలు కలిసి తెలంగాణను దోచుకుం టున్నాయని ఆరోపించారు.
రైతుల ను, అధికారులను ఇబ్బందులకు గురిచేస్తే సహించమని స్పష్టం చేశారు. రేవంత్‌కు కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం ఇష్టం లేక గవర్నర్, కేంద్ర ప్రభుత్వం మీదకు నెడుతున్నాడని విమర్శించారు.